సుడిగాలి సుధీర్, రష్మీ కెమిస్ట్రీ బుల్లితెరపై ఏ రేంజ్‌లో వర్కౌట్ అయిందో అందరికీ తెలిసిందే. ఎవరు ఎన్ని రకాలు రాసినా, మాట్లాడినా తామిద్దరి మధ్య ఉన్నది మాత్రం కేవలం స్నేహమే అని, అది కూడా హాయ్ బాయ్ చెప్పుకునేంత చనువు మాత్రమే ఉందని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే అదే సమయంలో తెరపై వీరు పండించే రొమాన్స్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఢీ, జబర్దస్త్ షోలో వీరు చేసే స్కిట్స్ మాత్రం అందరికీ అనుమానాలు కలిగిస్తూనే ఉంటాయి.
ఎక్కడో మ్యాజిక్ షోలు చేసుకుంటూ ఉండే సుధీర్.. నేడు బుల్లితెరపై స్టార్‌గా వెండితెరపై హీరోగా ఎదిగాడు. అయితే సుధీర్ సాధించిన ఈ విజయాన్ని అతి దగ్గర చూసిన వారిలో రష్మీ ఒకరు. తాజాగా సుధీర్ విజయాలను, పడిన కష్టాలను అన్నింటిని ఒకే సాంగ్‌లో ప్రజెంట్ చేశారు ఢీ వేదికపై. ఇక దీనికి సంబంధించి రిలీజ్ చేసిన ప్రోమో ఎంతో ఎమోషనల్‌గా ఉంది. సుధీర్ ఏకంగా కన్నీరు పెట్టుకుని ఇదే బెస్ట్ డెడికేషన్ అని కితాబిచ్చాడు.
వాటర్ బాటిల్ కొనేంత డబ్బులు లేక ట్యాప్ వాటర్ తాగిన రోజులు, తండ్రికి ఆరోగ్యం బాలేక బాధపడిన రోజులు, తిండి దొరక్క కష్టపడుతున్న నాటి సంగతులను ఎంతో ఎమోషనల్‌గా ప్రజెంట్ చేశారు. ఈ పర్ఫామెన్స్ చూసిన రష్మీ.. సుధీర్ జర్నీపై కామెంట్ చేసి ప్రేమను చాటుకుంది. ఇది అతని హార్డ్ వర్క్.. అతని ప్రయాణం.. అతని బాధ అంటూ ప్రేమగా హత్తుకుంది. మొత్తానికి వచ్చే వారం ఢీ షో సుధీర్‌పై ఎమోషనల్ పర్ఫామెన్స్ చేసి అదరగొట్టబోతోన్నారన్నమాట.