స్విమ్ సూట్ లో రాశీ అందాలు

స్విమ్ సూట్ లో రాశీ అందాలు

రాశీ ఖన్నా అంటే తెలియని వారు వుండరు . తెలుగులో అనేక సినిమాలు చేసింది . ఈ అమ్మడు ఇప్పుడు సరికొత్త అందాలతో అదిరిపోతుందట . ఇంతకు ముందు రవితేజ తో నటించిన”బెంగాల్ టైగర్ ” చిత్రంలో స్విమ్ సూట్ వేసుకొని అందాలను ఆరబోసిన సంగతి ఎవరు మర్చిపోరు . అయితే అప్పుడు రాశీ ఖన్నా ను ఆ స్విమ్ డ్రెస్సులో చూసి అభిమానులంతా ట్రోల్ చేశారట . “స్విమ్ సూట్ వేస్తె చూసే ప్రేక్షకుల మతులు పోగొట్టాలి , ముఖ్యంగా యువకులను కిర్రెకించాలి … నిన్ను చూస్తే .. జాలేస్తుంది అమ్మడూ ” అంటూ కామెంట్లు రావడంతో రాశీ చాలా బాధపడిందట .

అందుకే ఎవరైతే తనను చూసి జాలి పడ్డారో , ఎవరు దారుణంగా కామెంట్లు చేశారో .. వారితోనే స్విమ్ సూట్ వేస్తె నువ్వే వెయ్యాలి రాశీ అనిపించుకుంటాను అని ఛాలెంజ్ చేసిందట. ఇక అప్పటి నుంచి బాడీ షేపుల మీద దృష్టి పెట్టిందట. రెండు సంవత్సరాల పాటు … తన శరీరాన్ని అందంగా , ఆకర్షణీయంగా , అదిరిపోయే షేపులతో తీర్చి దిద్దుకుందట . ఇక ఇప్పుడు స్విమ్ సూట్ వేసుకొని … నా బాడీ చూశారుగా … ఇప్పుడు ట్రోల్ చెయ్యండి అంటూ సవాల్ విసురుతుందట . ప్రస్తుతం రాశీఖన్నా వెంకటేష్ తో “వెంకీ మామ ” చిత్రంలో నటిస్తుంది .