మామ్ ప‌ర్మిష‌న్ తో బెడ్ రూమ్ సీన్లా రాశీ!

అందం..అభిన‌యంతో రాశీఖ‌న్నా టాలీవుడ్ లో రాణిస్తోంది. కెరీర్ ఆరంభంలో బొద్దు అందంతో మెప్పించిన అమ్మ‌డు ఇప్పుడు స్లిమ్ లుక్ లో మ‌రింత ఆక‌ట్టుకుంటోంది. కుర్ర కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టే హీరోయిన్ గా తొలి నాళ్ల‌లోనే ముద్ర వేసుకుంది. ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు అటుపై ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ లో అవ‌కాశాలు ఒడిసిప‌ట్టుకుంది. అయితే గ్లామ‌ర్ పాత్ర‌ల విష‌యంలో ఆరంభంలో గిరి గీసుకుని కూర్చున్న అమ్మ‌డు ఇటీవ‌లే ఆ హ‌ద్దుల్నీ దాటేసిన సంగ‌తి తెలిసిందే. వర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ లో అమ్మ‌డు డీ గ్లామ‌ర్ రోల్ లో అద‌ర‌గొట్టింది.

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో బెడ్ రూమ్ స‌న్నివేశాల్లో ఒదిగిపోయింది. ఇంకా మ‌రెన్నో ఇంటిమేట్ స‌న్నివేశాల‌తో టాలీవుడ్ కి కొత్త‌ రాశీని ప‌రిచ‌యం చేసింది. అయితే బెడ్ రూమ్ సీన్స్ వెనుక దాగి ఉన్న క‌ఠోర నిజాల్ని చెప్పి రాశీ కాస్తంత ఎమోష‌న్ కి గురైన‌ట్లే అనిపించింది. బెడ్ రూమ్ లో హీరోతో అలాంటి సీన్ లో న‌టించ‌డం త‌న‌కెంత మాత్రం ఇష్టం లేదుట‌. ఇంటిమేట్ స‌న్నివేశాల్లో న‌టించాలంటే గ‌ట్స్ ఉండాలి. తొలిసారి మ‌ద్రాస్ కేఫ్ లో ఓ ఇంటిమేట్ సీన్ లో న‌టించా. అదే మొద‌టి సారి కావ‌డంతో చాలా టెన్ష‌న్ ప‌డ్డా. ఇప్పుడు భ‌యం పోయింది. వాటిల్లో ఎలా న‌టించాలి అన్న దానిపై ఓ క్లారిటీ వ‌చ్చిందని తెలిపింది.

ఈ విష‌యం అమ్మ‌కు ముందు రోజ చెప్పా. దీంతో అమ్మ రాత్రంతా నిద్ర‌పోలేదు. ఆ సీన్ షాట్ పూర్త‌య్యాక కార్వాన్ లోకి వెళ్లి విప‌రీతంగా ఏడ్చేసా. రాశీ ఇలాంటి సీన్లు చేసిందేంట‌ని చాలా బాధ‌ప‌డ్డా. ఆ త‌ర్వాత లిమిట్స్ క్రాస్ చేయ‌కూడ‌ద‌నుకున్నా. కానీ మ‌ళ్లీ త‌ప్ప‌లేదు. వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రంలో బెడ్ రూమ్ సీన్ విష‌యంలో కొంచెం భ‌యం వేసింది. అయితే విజ‌య్ బాగా స‌హ‌క‌రించడు. నాకు ఇప్పటికే అలాంటి ఇమేజ్ ఉంది. నువ్వేం టెన్ష‌న్ ప‌డ‌కు అని ఆ సీన్ చేసే ముందు టెన్ష‌న్ పొగొట్టాడు. ఈ విష‌యం కూడా అమ్మ‌కు ముందే చెప్పాన‌ని రాశి తెలిపింది.