ఫేమ‌స్ ల‌వ‌ర్ పెద్ద సాహ‌స‌మే చేస్తున్నాడే?

రౌడీస్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క్రియేటివ్ క‌మ‌ర్శియ‌ల్స్ బ్యాన‌ర్ పై కె.ఎస్ రామారావు ప్ర‌తిష్టాత్మ‌కంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు సినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చాయి. అర్జున్ రెడ్డి స్టైల్ గెట‌ప్ ఆక‌ట్టుకుంటోంది. ఇదో రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్. తొలిసారి క్రాంతి మాధ‌వ్ త‌న ఫ‌రిది దాటి తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మ‌ది. సాధ‌ర‌ణంగా ఆయ‌న సినిమాలు క్లీన్ ఎంట‌ర్ టైనర్లుగా గా ఉంటాయి. కానీ ఈసారి క‌మ‌ర్శియాల్టీ కోసం ఘాటైన స‌న్నివేశాలు భారీగానే జొప్పించిన‌ట్లు టీజ‌ర్ చెప్పేసింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో విజ‌య్ స్ర్కిప్ట్ రైట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడుట‌. త‌ను రాసుకున్న స్టోరీల్లో తానే హీరోగా ఊహించుకుని తేలుతుంటాడుట‌. ఇలా ర‌క‌ర‌కాల క‌థ‌ల్లో రౌడీ స్టార్ డిఫ‌రెంట్ షెడ్స్ లో క‌నిపంచ‌నున్నాడుట‌. ఇప్ప‌టికే రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌న్న‌ది అధికారికం. తాజా ప్ర‌చారంతో! రౌడీ స్టార్ ఇంకెన్ని గెట‌ప్ప్ లో క‌నిపిస్తాడు అన్న ఆస‌క్తి మొద‌లైంది. అయితే ఇలాంటి స్ర్కిప్ట్ ను ద‌ర్శ‌కుడు గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో గంద‌ర‌గోళం లేకుండా క‌న్వే చేయ‌గ‌లిగాలి. లేదంటే ఆర్డ‌రే మారిపోతుంది. మ‌రి స్ర్కీన్ ప్లే కోసం ద‌ర్శ‌కుడు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడో చూడాలి. ఫిబ్ర‌వ‌రి లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.