Karthi : సర్దార్ సినిమా కోసం గుర్తుపట్టకుండా మారిన ఆ హీరో ఎవరో తెలుసా?

Karthi : ఇప్పటి తరం హీరోలు ఒక్కో సినిమా కోసం ఒక్కో స్టైల్ లుక్ కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకానొక సమయంలో హీరోలందరు 6ప్యాక్ మీద పడ్డారు. కండలు పెంచి అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టారు. అయితే కేవలం స్టైలిష్ లుక్ కోసమే కాదు పాత్రకోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు ఇప్పటి హీరోలు. ఇందుకోసం చాలా కష్టపడుతుంటారు. హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉండడటమే కారణం.

తాజాగా కార్తీ తన కొత్త చిత్రం సర్దార్ కోసం గుర్తుపట్టనంతగా తయారయ్యాడు. ఈ సినిమాలో కార్తీ రెండు పాత్రల్లో కనిపించనున్నారు.తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు. ఇందులో కార్తి సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఈ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తిగా గుర్తు పట్టకుండా మారిపోయిన కార్తీని చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. గతంలో కూడా కొన్ని సినిమాల కోసం పూర్తిగా మేకోవర్ అయిపోయాడు కార్తీ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. సినిమా కోసం ఈయన పెట్టే ఫోకస్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని కార్తి సర్దార్ తో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

ఈ మధ్య వరుసగా తెలుగు ఓల్డ్ టైటిల్స్ పై కన్నేశాడు కార్తీ . ఇప్పటికే పాత సినిమా టైటిల్స్ తో ఖైదీ, దొంగ, సుల్తాన్, కాష్మోరా, చిన్న బాబు లాంటి సినిమాలు చేశాడు కార్తి. ఇప్పుడు సర్దార్ సినిమాలో నటిస్తున్నాడు. ఐదేళ్ల కింద పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సినిమా కూడా సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు ఇదే టైటిల్ తో ఈ తమిళ హీరో వస్తున్నాడు. పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.