బెజవాడ రౌడీయిజమ్ పై “రంగు” పడింది

బెజవాడ రౌడీయిజమ్ పై మరో సినిమా “రంగు ” . యు అండ్ ఐ ఎంటర్ టైన్మెంట్స్ వారు తనీష్, పరుచురి రవి, ప్రియా సింగ్ తో కార్తికేయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి సోమవారం నాడు సెన్సార్ అయ్యింది . రంగు సినిమాకు సెన్సార్ వారు యు /ఏ సర్టిఫికెటును ఇచ్చారు .
బెజవాడ రాజకీయాలు , రౌడీయిజం పై గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి . అయితే ఒక నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించినట్టు నిర్మాత పద్మనాభ రెడ్డి పేర్కొన్నాడు .

పవన్ కుమార్ అనే విద్యార్థి చదువుకుంటూ తెలియకుండా రౌడీ గా ఎలామారిపోయాడో , మారిన తరువాత ఆ రొంపిలో నుంచే బయటికి వచ్చే ప్రయత్నంలో జరిగే కథే రంగు చిత్రం. ఇది పూర్తిగా బెజవాడలో నిర్మించిన సినిమా .