‘ఇస్మార్ట్‌ శంకర్’ టీజర్‌ ఎలా ఉందంటే…

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్’. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ ని …ఈ రోజు(బుధవారం) రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేశారు. ‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అని రామ్‌ స్టైల్‌గా తన పేరుని చెప్తున్న డైలాగుతో తో టీజర్‌ మొదలైన ఈ టీజర్ రెగ్యులర్ పూరి టెంప్లేట్ మూవీ స్టైల్ లోనే ఉంది. ఎనర్జిటిక్ హీరో, గ్యాంగస్టర్స్, గన్స్, పోలీస్ లతో టీజర్ నిండిపోయింది. మరీ ముఖ్యంగా రామ్ యాస మరీ ఆర్టిఫిషియల్ గా ఉంది.

డ్యాన్స్‌, ఫైటింగ్‌ సన్నివేశాల్లో రామ్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..’ అని చివర్లో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

Ismart Shankar Teaser | Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh | Puri Jagannadh

నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌, నభాలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. మరో మూడు పాటలు చిత్రీకరిస్తే షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూన్‌ చివరివారంలో కానీ, జులైలో కానీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.