రిస్క్ ఎందుకని ‘ఇస్మార్ట్‌ శంకర్’ రిలీజ్ వాయిదా

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్’. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

వాస్తవానికి ఈ చిత్రం జూలై 12న విడుదల కావాల్సి ఉంది. అయితే వరల్డ్ కఫ్ ఫైనల్ జూలై14న జరగనుంది. వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ బాగా ఉండటంతో జనాలు పెద్దగా థియేటర్స్‌కి రారు. కాబట్టి వరల్డ్ కప్ ఫైనల్స్ ఇంపాక్ట్ చిత్రంపై పడే అవకాశం ఉంది. కాబట్టి చిత్ర యూనిట్ ఛాన్స్ తీసుకునేందుకు సాహసించట్లేదు. దీంతో తమ టీంతో దర్శక,నిర్మాతలు ఈ విషయమై చర్చించిన మీదట ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ డేట్‌ను జూలై 12 నుంచి 18కి వాయిదా వేసింది.

నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.