‘మజలి’ టీజర్ పై వర్మ కామెంట్,కాస్సేపటికే డిలేట్

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన ట్విట్టర్ లో చేసే కామెంట్స్ కోసం మీడియా ఎదురుచూస్తూంటుంది. ఎప్పుడే బాంబు పేలుస్తాడో అని అభిమానులు ఆసక్తి చూపిస్తూంటారు. దాంతో ఆయన పాజిటివ్ అనే మాటలు సైతం ఒక్కోసారి నెగిటివ్ గా కనిపిస్తూంటాయి. తాజాగా మజలి ట్రైలర్ చూసి ఆయన చేసిన కామెంట్స్ అదే ఫీలింగ్ ని తీసుకొచ్చాయి. దాంతో వెంటనే వర్మ వాటిని డిలేట్ చేసేసారు.

నిన్న రాత్రి మజలి చిత్రం ట్రైలర్ రిలీజైంది. అక్కినేని కుటుంబంతో తనకున్న అనుబంధంతో రామ్ గోపాల్ వర్మ ఈ ట్రైలర్ పై తన దైనశైలిలో కామెంట్స్ చేసారు. అయితే ఆ కామెంట్స్ తనని బ్యాడ్ చేసేటట్లు ఉన్నాయని భావించిన ఆయన వెంటనే డిలేట్ చేసేసారు. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేసారు అంటే..యధాతథంగా..

“I am frankly not blown away by you but if the awesome @Samanthaprabhu2 is blown away by you, am sure you must be having something to blow about,”

‘నాగచైతన్య.. ట్రైలర్‌లో సమంత కన్నా నాకు నువ్వే ఎక్కువగా నచ్చావు. ఇలా చెప్పానని నన్ను మరోలా అనుకోకండి. ఇది నిజం’ అని వర్మ పోస్ట్‌ చేశారు.

వెంటనే ఆయన ట్వీట్‌కు చైతన్య రిప్లై ఇచ్చారు. ‘మంచిది రామ్‌గోపాల్‌ వర్మ.. ఏదేమైతేనేం మనమంతా సంతోషించాల్సిన విషయమేగా.. చీర్స్‌’ అని పోస్ట్‌ చేశారు. అయితే వర్మ తన ట్వీట్‌ను కాసేపటికి డిలీట్‌ చేశారు.

మరో ప్రక్క దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదాలు, రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం మార్చి 29న రిలీజై మంచి విజయం సాధించింది.