తండ్రి డ్రీమ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ త్యాగమా?

నాన్న‌కు ప్రేమతో చెర్రీ కానుక‌

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా:న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. స‌రిగ్గా 40 రోజుల స‌మ‌యం ఉందింకా. ఈ కొద్దిపాటి స‌మ‌యంలో `సాహో` త‌ర‌హాలోనే భారీ ప్ర‌మోష‌న్స్ కి కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. నేడు ముంబైలో `సైరా` నాలుగు భాష‌ల టీజ‌ర్ల‌ను లాంచ్ చేశారు. టీజ‌ర్ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, సురేంద‌ర్ రెడ్డి, సుదీప్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

<

p style=”text-align: justify”>ఈ వేదిక‌పై సైరా చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన సుదీప్ మాట్లాడుతూ చిత్ర నిర్మాత‌ రామ్ చ‌ర‌ణ్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఒక హీరో అయ్యి ఉండీ త‌న క‌ల‌ల్ని త్యాగం చేసి తండ్రి డ్రీమ్ నెర‌వేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న గొప్ప త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌. అలాంటి కొడుకు ఉన్నందుకు ఆయ‌న గ‌ర్వించాలి! అంటూ చిరుత‌న‌యుడిపై ప్ర‌శంస‌లు కురిపించారు. తండ్రి ఆశ‌యం కోస‌మే కాదు .. ఇత‌ర న‌టుల కోసం ఇలాంటి సినిమా తీయాల‌ని చ‌ర‌ణ్ భావించార‌ని సుదీప్ పొగిడేశారు. ఇలాంటి భారీ చిత్రాల్లో న‌టించిన‌ప్పుడే త‌మ‌ను తాము ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసుకోవ‌డం సులువు అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. మొత్తానికి వేదిక‌పై రామ్ చ‌ర‌ణ్ కి న‌టీన‌టుల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. చిరంజీవి మాట్లాడుతూ బిగ్ బిని ఈ చిత్రంలో న‌టించాల్సిందిగా కోర‌గా వెంట‌నే త‌డుముకోకుండా ఓకే చెప్పార‌ని తెలిపారు. అమితాబ్ జి నా రియల్ లైఫ్ మెంటర్.. నాకు ఆయనే మెగాస్టార్ అంటూ ముంబై మీడియా ముందు త‌న అభిమానాన్ని చాటుకున్నారు చిరంజీవి.