లేటెస్ట్ : ప్రపంచ వ్యాప్తంగా రామ్ “వారియర్” డే 1 వసూళ్ల డీటెయిల్స్ ఇవే..!

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక సినిమాలు అదరగొట్టగా మరికొన్ని చిత్రాలు వెలవెలబోయాయి. అసలు ఏమాత్రం అనుకున్న రేంజ్ వసూళ్లు అందుకోలేక డీలా పడ్డాయి. ముఖ్యంగా ఈ ఏడాది జూన్ తో సగం సంవత్సరం పూర్తి కాగా దీని తర్వాత జూలై మొదటి వారం నుంచి వస్తున్న సినిమాలు పరిస్థితి మరింత దారుణంగా మారింది.

దీనితో ఇక ఒక సరైన మాస్ సినిమా పడక అంతా అనుకున్నారు ఈ టైం లో వచ్చిన సాలీడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ది వారియర్”. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ స్టార్ దర్శకుడు ఎన్ లింగుసామి కాంబోలో చేసిన ఈ చిత్రం ఏపీ తెలంగాణాలో అయితే మంచి నంబర్స్ నే నమోదు చేయగా..

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సినిమా వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి. ఇక ఇవి కూడా టోటల్ గా ప్రాంతాల వారీగా చూసినట్టు అయితే.. నిజాం – 1.96 కోట్లు, సీడెడ్ – 1.04 కోట్లు, తూర్పు గోదావరి – 51 లక్షలు, వెస్ట్ గోదావరి – 67 లక్షలు, కృష్ణ – 38 లక్షలు, నెల్లూరు – 29 లక్షలు, వైజాగ్- 1.02 కోట్లు, గుంటూరు- 1.19 కోట్లు రాబట్టింది.

ఇంకా తమిళ నాడులో కూడా రిలీజ్ అయ్యిన ఈ సినిమా అక్కడ 94 లక్షలు, కర్ణాటక – 32 లక్షలు షేర్ అలాగే ఓవర్సీస్ లో 41 లక్షలు రాబట్టింది. దీనితో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8.73 కోట్లు షేర్ ని రాబట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా అయితే ఇది గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు.