ఒక హీరోతో అనుకున్న కథని మరొకరితో చేయటం ఇండస్ట్రీలో మామూలే. అలాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ అనుకున్న ప్రాజెక్టుని …రామ్ తో చేస్తున్నారని టాక్. ఆ ప్రాజెక్టు మరేదో కాదు..రీసెంట్ గా పూరి జగన్నాథ్ తో మొదలెట్టిందే. ఆ మధ్యన పూరి జగన్నాథ్ ..పనిగట్టుకుని కాకినాడ వెళ్లి మరీ విజయ్ కు స్క్రిప్టు వినిపించాడని వార్తలు వచ్చాయి.
అయితే విజయ్ దేవరకొండ పూర్తి స్దాయి బిజీగా ఉండటంతో నో చెప్పటం జరిగిందట. ఇమ్మీడియట్ గా కొద్ది రోజుల్లో రామ్ తో కన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఈ స్క్రిప్టు పూర్తి తెలంగాణా యాసలో సాగే కథ అయ్యిందంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ ఆ సినిమానే.
ఇక సినిమాకు సినిమాకు మధ్య ఎప్పుడూ నెలకంటే ఎక్కువగా గ్యాప్ తీసుకొని పూరిజగన్నాథ్ మొదటి సారి చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాను ప్రకటించాడు. ఎప్పటినుంచో ఎనర్జిటిక్ హీరో రామ్ తో చేయాలనుకున్నాడు కానీ ఇన్నాళ్లకు కుదిరింది. ఓ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఓ కొత్త పాయింట్ ని డీల్ చేస్తారట.
అలాగే తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్ గా ప్రెజెంట్ చెయ్యడంలో పూరి జగన్నాధ్ పండిపోయారు. ముఖ్యంగా పూరి హీరోలకు ఇచ్చే మేకోవర్ ను చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతూంటారు. ఇప్పుడు రామ్ ను కూడా అలాగే లుక్స్ తో పాటు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ప్రెజెంట్ చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేస్తారని సమాచారం.