‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ట్రైలర్ టాక్ : చంద్రబాబే సినిమాని హిట్ చేస్తాడు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పిన సమయానికే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ట్రైలర్‌ ని విడుదల చేసారు. లక్ష్మీ పార్వతి నందమూరి తారక రామారావు జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతోందీ చిత్రం.

నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్‌ ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’అంటూ ముగయటం నాటకీయంగా బాగుంది.

1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అనే విషయాలను ట్రైలర్‌లో చూపే ప్రయత్నం చేసారు వర్మ. ఇక ఈ ట్రైలర్‌ పై ఎంత క్రేజ్ క్రియేట్ అయ్యిందంటే.. రిలీజ్‌ చేసిన నిమిషాల్లోనే దాదాపు లక్ష వ్యూస్‌ రావడం విశేషం.

Lakshmi's NTR Movie Trailer | #NTRtrueSTORY | RGV | Yagna Shetty | Agasthya Manju | Vennupotu Story

ఈ ట్రైలర్ ఇంత పెద్ద హిట్ అవటానికి కారణం చంద్రబాబు నాయుడుని ఈ ట్రైలర్ లో రామ్ గోపాల్ వర్మ ఎలా చూపించారనే ఆసక్తే కారణం అంటున్నారు. రేపు సినిమాకూడా ఓపినింగ్స్ రావటానికి చంద్రబాబు నాయుడు పాత్రే కారణం అవుతుందని చెప్తున్నారు.

అలాగే ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో ఉంటాయని రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జీవీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతమందిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ‘యన్‌టిఆర్‌-మహానాయకుడు’ ఫిబ్రవరి 22న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్ర ట్రైలర్‌ను ప్రేమికుల రోజున విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.