మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’.రంగస్దలం వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. అయితే సినిమా క్రేజ్ కు తగ్గట్లే ప్రమోషన్స్ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు.
అయితే వచ్చే వారం నుంచి ప్రమోషన్స్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యినట్లు సమాచారం. అందుకు కారణం ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారు 72 కోట్లకు మొత్తం థియోటర్స్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వారు తెలంగాణా, ఆంధ్రాలలో భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఓ రేంజిలో పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
యువి క్రియేషన్స్ సీన్ లోకి రాగానే రామ్ చరణ్,బోయపాటి రిలీఫ్ ఫీలైనట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని అదే బ్యానర్ లో చేయటానికి ఆసక్తి చూపాడని…అందుకే యువి క్రియేషన్స్ వారు ఆ రేటు పెట్టారని సమాచారం. అయితే ఆ రేటు వర్కవుట్ అవుతుందా..సంక్రాతికి విడుదల అవుతున్న సినిమాల పోటీకి తట్టుకుని నిలబడి …మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అని ఫిల్మ్ సర్కిల్స్ లో ఎదురుచూపులు , చర్చలు మొదలయ్యాయి.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అళాగే మాజీ హీరోలు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.