బిగ్ క్లారిటీ : చరణ్, పవన్ డైరెక్టర్ తో కాదు ఈ డైరెక్టర్ తో సినిమా అట..!

టాలీవుడ్ సినిమా దగ్గర భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో RRR హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కూడా తన సినిమాల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ప్లాన్ చేస్తుండగా నేషనల్ నుంచి వరల్డ్ లెవెల్లో కూడా తన సినిమాలు ఉండబోతున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాల లైనప్ లో నిన్ననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఓ సినిమాలు చేయనున్నాడని కొన్ని గాసిప్స్ బయటకి వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై ఓ తుది క్లారిటీ ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చేసింది.

రామ్ చరణ్ – శ్రీరామ్ వేణు ల కాంబోలో సినిమా అనేది పచ్చి అబద్దం అని అందులో ఎలాంటి నిజం లేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే మరో దర్శకుడు చరణ్ లైన్ లో ఉన్నాడని తెలుస్తుంది. మరి అది  దర్శకుడు కూడా కాదు కన్నడ ఇండస్ట్రీ కి చెందిన దర్శకుడు అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

అక్కడ మఫ్టీ ఫేమ్ దర్శకుడు నర్తన్ రామ్ చరణ్ ని ఒప్పించినట్టుగా అంటున్నారు. మరి ఈ కాంబో ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. ప్రెజెంట్ అయితే చరణ్ శంకర్ తో సినిమాలు బిజీగా ఉండగా నెక్స్ట్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయనున్నాడు.