రామ్ చరణ్ కూడా చూసి, తన రివ్యూ ఇచ్చేసాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా  చిత్రం‘అరవింద సమేత వీర రాఘవ’. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. ఓవర్ సీస్ తో పాటు… తెలుగు రెండు రాష్ట్రల్లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది.  భాక్సాఫీస్ వద్ద ఈచిత్రానికి పోటీ కూడా లేకపోవడం, దసరా సెలవులు ఈ చిత్రానికి కలిసి వస్తున్నాయి.

కలెక్షన్స్ విషయం ప్రక్కన పెడితే ఈ చిత్రానికి ఇండస్ట్రీ నుంచి కూడా ప్రశంశల వర్షం కురుస్తున్నాయి. ఇప్పటికే రాజమోళి వంటివారు ఈ సినిమా గురించి మాట్లాడారు. ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది.  రీసెంట్ గా  ఈ చిత్రాన్ని చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఫై తన అభిప్రాయాన్ని తన పేస్ బుక్ ఖాతా ద్వారా చెప్పారు.

‘‘తన కెరీర్‌లో మరోసారి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో అలరించారు. బోల్డ్ స్టోరీ, సూపర్బ్ డైరెక్షన్ మరియు మంచి డైలాగులతో త్రివిక్రమ్ ఆకట్టుకున్నారు. జగపతిబాబు నటన, థమన్ మ్యూజిక్ ఈ సినిమాకి పిల్లర్స్‌గా నిలిచాయి. పూజా హెగ్డే నటనను బాగా ఎంజాయ్ చేశాను. అరవింద సమేత టీమ్‌కు నా  అభినందనలు’’ అంటూ చరణ్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి త్వరలోనే నటించనున్నారనే విషయం  తెలిసిందే.