రకుల్ ప్రీత్ శ్రీదేవిగా మెప్పిస్తుందా ?

ఎన్టీఆర్ బయోపిక్ లో మహానటి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. రకుల్ పై ఇప్పటికే కొన్ని సన్నివేశాలు తీశారని తెలుస్తుంది . 1972లో ఎన్టీఆర్  నటించిన బడిపంతులు సినిమాలో శ్రీదేవి ఆయన  మానవరాలిగా  నటించింది.

 

ఆ తరువాత   1979లో వేటగాడు సినిమాలో హీరోయిన్ గా తొలిసారి నటించింది . ఈ సినిమా సరికొత్త ట్రెండు ను సృష్టించింది . అక్కడ నుంచి సర్దార్ పాపారాయుడు , రౌడీరాముడు , కొంటె కృష్ణుడు , ఆటగాడు, సత్యం శివమ్, కొండవీటి సింహం , గజదొంగ,  అగ్గిరవ్వ , వయ్యారి భామలు, వగలమారి భర్తలు, జస్టిస్  చౌదరీ , బొబ్బులి పులి, అనురాగ దేవత, సింహం నవ్వింది సినిమాల్లో నటించింది . ఎన్టీఆర్ , శ్రీదేవిది విజయవంతమైన జంట.

తెర పైన వారు కనిపిస్తే థియేటర్లో  ఈలలు , చప్పట్లు మారు మ్రోగేవి . ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ , శ్రీదేవి పాత్రధారి రకుల్ ప్రీత్ మీద పాటలు  తప్పకుండా ఉంటాయి . మరి రకుల్ ప్రీత్  శ్రీదేవి పాత్రలో ఎంతవరకు మెప్పిస్తుందో మరి. గ్లామర్ తారగా పేరు తెచ్చుకున్న రకుల్ కు ఎన్టీఆర్ బయోపిక్ లో అవకాశం రావడం అదృష్టమే .ఈరోజు రకుల్ పుట్టినరోజు . రకుల్ శ్రీదేవి పాత్రలో ఎలా ఉందొ … విడుదల చేసే స్టిల్ చూస్తే  కానీ తెలియదు .