బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన రాక్షసుడు
ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో కథానాయిక. రమేష్ వర్మ దర్శకుడు. విజయవాడ కె.ఎల్.యూనివర్శిటీ అధినేతలు హవీష్, కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా
సెన్సార్ పూర్తయింది. యుఏ సర్టిఫికేట్ దక్కింది. 149 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ సంగతులు బయటకి వచ్చాయి.
వరుస ఫ్లాపుల్లో ఉన్నా వ్యాపార వర్గాలు సైతం విస్మయపడేలా `రాక్షసుడు` వ్యాపారం సాగడంపై ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి 35 కోట్ల మేర సాగింది. ఏపీ, నైజాం 13.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ సాగింది. ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మేర
థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేశారు. శాటిలైట్ 6 కోట్లు.. హిందీ డబ్బింగ్ 12.5 కోట్ల బిజినెస్ సాగింది.
ప్రాంతాల వారీగా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు చూస్తే నైజాం-5.5కోట్లు, సీడెడ్-2 కోట్లు, వైజాగ్-1.5కోట్లు, తూ.గో జిల్లా- 95లక్షలు, ప.గో జిల్లా-85 లక్షలు, కృష్ణ- 1కోటి, గుంటూరు-1.20 కోట్లు, నెల్లూరు -50
లక్షలు, కర్నాటక -1.1కోట్లు.. ఓవర్సీస్-7లక్షలు మేర బిజినెస్ సాగింది. ఇతర భారతదేశం -7లక్షల బిజినెస్ చేశారు.
20 కోట్లు వసూలు చేస్తే హిట్టయినట్టు. 19-24 కోట్లు వసూలు చేస్తే సూపర్ హిట్టు. 24 కోట్లు వసూలు
చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టినట్టు. 13 కోట్ల లోపు వస్తే యావరేజ్. 15 కోట్లు వసూలు చేస్తే అబౌ యావరేజ్ అంటూ ట్రేడ్ విశ్లేషిస్తోంది.