మెగా హీరో.. మరో రీమేక్?

మెగా ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో వరుణ్ తేజ్.. 2014లో ముకుంద సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం, ఎఫ్2, గద్దల కొండ గణేష్, ఘని, ఎఫ్3 సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఘనీ సినిమా తర్వాత నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలపై దృష్టి పెట్టాడు.

ప్రవీణ్ సత్తారుతో ఆయన సినిమా షూటింగ్ బుడాపెస్ట్‌లో జరుగుతోంది. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరుణ్ పైలట్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తి కాక ముందే ఆయన తన నెక్స్ట్ సినిమాను లైన్ లో పెట్టేశారు.

అది కూడా ఓ రీమేక్ చిత్రం అని తెలుస్తోంది. కార్తీక్ ఆర్యన్ మరియు కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో నటించి హిందీ బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రం భూల్ భూలయ్య 2 సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నటించాలని చూస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయట.

రాక్షసన్ సినిమా రీమేక్‌కి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జ్ఞానవేల్‌ రాజా స్టూడియో గ్రీన్ ఈ ప్రాజెక్ట్‌ను బ్యాంక్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని.. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత వరుణ్ తేజ్ ఈ సినిమాకు సైన్ చేయనున్నారని సమాచారంం.

రమేష్ వర్మ రాక్షసుడు సీక్వెల్‌ను కూడా రూపొందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వస్తాయని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఎం జరగనుందో.