అది నోరా లేక ఇంకేమన్నానా…ఈ ఛండాలం ఏమిటి

అబ్బబ్బే.అది మేము అంటున్న మాటలు కాదు..సోషల్ మీడియా జనం, సినిమావాళ్లు ..రాఖీ సావంత్ ని అంటున్నవి. ఎందుకలా హఠాత్తుగా ఆమెను టార్గెట్ చేసారు అంటారా…రాఖీ ఎప్పటిలాగే నోటికొచ్చినట్లు మాట్లాడితే మండదూ. ఈ సారి ఏమంది అంటే…నూటికి 99 శాతం అమ్మాయిలు అన్నీ తెలిసి.. ఒప్పుకునే సినిమాల్లోకి వస్తారంటూ కామెంట్ చేసింది. తాను చెప్పేది వింటే అమ్మాయిలకు కోపం రావచ్చని కానీ ఇది నిజమో, కాదో అంతరాత్మను అడిగి తెలుసుకోవాలని మరీ చెప్పుకొచ్చింది.  అసలే ఓ ప్రక్కన మీటూ ఊద్యమం జరుగుతన్న ఈ సమయంలో రాఖీ మాటలు కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తాయి.

రాఖీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘అమ్మాయిలు  అవకాశాల కోసం ఆఫీస్ కు రాగానే   కమిట్‌మెంట్‌కు ఒప్పుకుంటే నిన్ను   హీరోయిన్‌గా చేస్తామని.. క్యాస్టింగ్ డైరెక్టర్లు అంటారు. దానికి మాగ్జిమం తొంతై తొమ్మిది  శాతం అమ్మాయిలు నిర్మాతలతో, డైరెక్టర్‌తో తమ ఇష్టపూర్తిగానే కమిట్ అవుతారు.

ఇలా చెప్తున్నానని, ఈ విషయాలు విని అమ్మాయిలు నాపై కోపం తెచ్చుకోవచ్చు కానీ ఒక్కసారి మీ అంతరాత్మను అనుభవపూర్వకంగా  అడగండి..గుర్తు చేసుకోండి నేను చెప్పింది నిజమో కాదో. ఏ అమ్మాయైనా ఇండస్ట్రీలో ముందుకెళ్లాలంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందే.

అయినా ముందుగా అమ్మాయిలను నిర్మాత కలవనే కలవరు. కాస్ట్యూం  డైరెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్‌ను కలుస్తారు. అప్పుడే అంతా జరిగిపోతుంది.
 అయితే మరో విషయం  ఈ విషయంలో మగవారు… ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకసారి పడకగదికి వచ్చిన అమ్మాయి, ఆపై వారిని బెదిరించి, బ్లాక్ మెయిల్‌కు కూడా దిగే అవకాసం ఉంది. అమ్మాయిలను అసలు నమ్మొద్దు’’ అని తెలిపారు.