సూపర్ స్టార్ రజనీకాంత్ కి బాంబ్ బెదిరింపు కాల్ వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి ఇంట్లో బాంబ్ పెట్టినట్లు..అది ఎప్పుడైనా పేలే అవకాశం ఉందని హెచ్చరించాడు. దీంతో ఈ విషయాన్ని రజనీ పోలీసులకు తెలపడంతో హుటా హుటిన పోలీసులులు చెన్నైలో ని రజనీ ఇంటికి చేరుకుని బాంబు తనీఖీ పనుల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం పోలీసులు బాంబ్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ ని రంగంలోకి దించి తనికీ చేస్తున్నారు. బాండ్ డిటెక్టర్లు, స్నిపర్ డాగ్స్ తో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే రజనీ ఇల్లు మొత్తం సెర్చ్ చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.
దీంతో ఇంటి బయట గార్డెన్, ఆ సమీపంగా ఉన్న ప్రాంతంలో సోదాలు చేస్తున్నారు. అయితే ఈ బెదిరింపు కాల్ వచ్చిన విషయం అభిమానులకు లీక్ అవ్వడంతో రజనీ ఇంటికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకున్నారు. దీంతో రజనీ సర్ది చెప్పడంతో కొంత మంది ఫ్యాన్స్ అక్కడి నుంచి వెను దిరిగారు. అయితే ఇంకా బాంబ్ తనీఖి పనులు యాధావిధిగా జరుగుతున్నాయి. ఇది కేవలం బెదిరింపు కాల్ మాత్రమే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బెదిరింపు కాల్ కు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తి ఎవరు? ఏ సమయంలో కాల్ చేసాడు? ఎక్కడ నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చింది? వంటి వివరాల్ని కాల్ ఆధారంగా సేకరిస్తున్నారు.
ఆ వ్యక్తిని పట్టుకుంటే బెదిరింపు కాల్ వెనుక అసలు విషయం ఏమై ఉంటుందో తెలుసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రజనీని ఇంట్లో ఉండే వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. మరి కాసేపటికి దీనిపై పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట-2 చిత్రానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. లాక్ డౌన్ కారణంగా రజనీ కుటుంబంతో ఇంట్లోనే గడుపుతున్నారు. తమిళనాడులో కరోనా కేసులు ఎక్కువవుతతోన్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే దిశగా ఆ రాష్ర్ట ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.