Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యంగా ఈయన నటుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల తరచూ వివాదాలలో నిలుస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ప్రకాష్ ఇద్దరూ మంచి స్నేహితులు వీరిద్దరూ కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే రాజకీయాలలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి అభిప్రాయాలు విభిన్నం కావడంతో ఇద్దరి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది.
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి అలాగే తిరుపతి లడ్డు కల్తీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అలాగే ఇటీవల హిందీ భాష గురించి కూడా ఆయన మాట్లాడిన తీరు పట్ల ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఇంత దారుణంగా అమ్ముడు పోవాలా అంటూ ప్రకాష్ రాజ్ పవన్ పై ఫైర్ అయ్యారు. ప్రకాష్ ముంబై లోకల్ ట్రైన్ లాంటి వ్యక్తి ఏ క్షణమైన తనని దింపేస్తారు అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటల పట్ల ప్రముఖ డైరెక్టర్ గీత కృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు.
మా ఎన్నికల్లోనే ఓడిపోయిన నువ్వు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సనాతనం ధర్మం గురించి మాట్లాడినా.. మరో మతం గురించి మాట్లాడినా అది రాజ్యాంగం ఆయనకు కల్పించిన హక్కు అని గీతాకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్‌కు పబ్లిసిటీ దురద ఉందని.. లైమ్ లైట్‌లో ఉండటానికే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ లాంటి వారిని టార్గెట్ చేశారని ఆయన తెలిపారు. ప్రకాష్ రాజ్ కు సినిమాలంటే చాలా పిచ్చి మంచి మంచి వేషాలు వస్తున్నాయి అలా సినిమాలలో నటిస్తూ ఉండగా ఈ రాజకీయాలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. కావాలని కొరివి పెట్టుకుని బీజేపీతో గొడవ పడటం కూడా వేస్ట్ అని ఎందుకంటే ఫైనల్‌గా అవార్డ్ ఇచ్చేది ఆ పార్టీయేనని గీతాకృష్ణ అన్నారు. ఢిల్లీకి లిస్ట్ వెళ్లిన తర్వాత అమిత్ షా గారు నీ పేరుకు సున్నా చుడితే నీ జీవితం ఫినిష్ అని హెచ్చరించారు. ప్రస్తుతం గీత కృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
