Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో కమర్షియల్ యాడ్స్ లో చేసి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజోల్. ఈమెకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా కాజోల్ చేసిన వాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాగా కాజోల్ నటించిన లేటెస్ట్ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా మాట్లాడుతూ తన కూతురిపై ట్రోల్స్ చేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నా కూతుర్ని విమర్శించే వాళ్ళు ఎవరూ నా కారు ముందుకు రావద్దు. ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది, మీరు అమేజింగ్.. ఇటువంటి కామెంట్లే ఉంటాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రం బ్యాడ్ కామెంట్ ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను.
చెడు గురించి కాదు అని చెప్పుకొచ్చింది. ఈ సందర్బంగా కాజోల్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా కాజోల్ వాఖ్యలపై అభిమానులు స్పందిస్తూ బాగా చెప్పారు అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే కాజోల్ సినిమా విషయానికి వస్తే.. ఇది కాజోల్ మొదటి సారి హరర్ పాత్రలో నటించిన మూవీ ఇది. విశాల్ ఫ్యురియా దర్శకత్వం వహిస్తున్న మా చిత్రంలో రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, కెరిన్ శర్మ, నితిన్, సూర్‌జ్యశిఖ దాస్ కీలక పాత్రల్లో నటించారు. కాజోల్ చివరగా క్రూ సినిమాలో నటించింది. కాజోల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ 1999 లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్ పుట్టాడు.