కరోనా  తగ్గేవరకూ  మిగిలిన సీన్స్  చేసుకుంటాడట ! 

సూపర్  స్టార్ రజినీకాంత్ తో జీవితంలో ఒక్క సినిమానైనా చేయాలని ప్రతి డైరెక్టర్ కల కంటాడు. అదీ తెలుగు గడ్డ మీద పుట్టిన ఒక డైరెక్టర్ అల కల కని నిజం చేసుకున్న గొప్పతనం ఒక్క ‘విశ్వాసం’ ఫేమ్ డైరెక్టర్ శివకే దక్కుతుంది. ఆయన దర్శకత్వంలో  రజిని హీరోగా ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.  మొదటి నుండి దర్శకుడు శివ పట్ల ఆసక్తి చూపుతూ వచ్చిన రజనీ  ఈ ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్స్ ఇవ్వడమే కాకుండా శివ పై పూర్తి నమ్మకం ఉందని.. అతని టాలెంట్ గురించి చాల పాజిటివ్ గా అందరికీ చెబుతున్నారు.  దాంతో సూపర్ స్టార్ అభిమానులతో పాటు  సినీ ప్రేక్షకులు కూడా వీరి కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారట. ఏమైనా మాస్  హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది గొప్ప టాలెంట్.   

మెయిన్ గా  మాస్, క్లాస్ రెండు వర్గాల చేత విజిల్ వేయించగలిగే ట్రీట్మెంట్  శివ ఇవ్వగలడని ఆయన గత సినిమాలు  ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలే అందుకు చక్కని ఉదాహరణ.  కాబట్టే సూపర్ స్టార్ ని డైరెక్టర్  శివ ఏ స్థాయిలో చూపుతాడోనని ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్  గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా గురించి శివ అయినా ఓపెన్ గా మాట్లాడితేనే పని అవుతుంది.  ఈ సినిమాని  సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ స్టార్ట్ కానుందని.. కాకపోతే రజినీ ఇప్పట్లో షూట్ లో పాల్గొనవసరం లేకుండా.. కరోనా ప్రభావం తగ్గేవరకూ శివ మిగిలిన సీన్స్ ను షూట్ చేసుకుంటాడని తెలుస్తోంది.     

అయితే ఎక్కువగా యాక్షన్ మూవీసే చేసే శివ.. మరి సూపర్ స్టార్ తో కూడా  ఫుల్ యాక్షనే ప్లాన్ చేశాడా.. లేక కొత్తధనం కోసం కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నాడా అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. కథ అయితే  సూపర్ స్టార్ కి అద్భుతంగా సెట్ అవుతుందని.. అందుకే రజినీకాంత్ కూడా సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారని తెలుస్తోంది.