ప్చ్..చిరుని దారుణంగా డామినేట్ చేస్తున్న రజినీ.!

ఇప్పుడు మన టాలీవుడ్ అలాగే కోలీవుడ్ ల నుంచి ఇద్దరు అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ ల సినిమాలు అయితే వచ్చాయి. కాగా అవి భోళా శంకర్ మరియు జైలర్ చిత్రాలు కాగా ఈ చిత్రాలతో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఒకొక్కరు ఒకో టాక్ ని అయితే తెచ్చుకున్నారు.

మరి వీటిలో జైలర్ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్ అందుకోగా ఇక నెక్స్ట్ డే లోనే మెగాస్టార్ భోళా శంకర్ వచ్చింది. అయితే ఈ రెండు చిత్రాల్లో భోళా శంకర్ కి దారుణమైన టాక్ వచ్చింది. అయినా కూడా పర్వాలేదు అనిపించే వసూళ్లు తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం అందుకోగా ఇక వరల్డ్ వైడ్ వసూళ్లు అయితే ఇప్పుడు భోళా శంకర్ వి బయటకి వచ్చాయి.

మరి మేకర్స్ చెప్పిన వసూళ్లతో ఈ చిత్రానికి 33 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు తెలిపారు. మరి ఇందులో కూడా జైలర్ భారీ మార్జిన్ తో తేడా ఉండగా ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో కూడా జైలర్ నే భోళా శంకర్ కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నట్టుగా తెలుస్తుంది.

కాగా తెలుగులో అయితే రెండో రోజు భోళా శంకర్ వసూళ్లు అలానే జైలర్ మూడో రోజు వసూళ్లు చూస్తే చిరు కన్నా రజినీ సినిమా వసూళ్లే ఎక్కువ నమోదు అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే అనేక చోట్ల భోళా శంకర్ ని జైలర్ తో రీ ప్లేస్ చేస్తుండగా జైలర్ కె హౌస్ ఫుల్స్ కూడా పడుతున్నట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. దీనితో తెలుగులో కూడా జైలర్ డామినేషన్ మాత్రమే కొనసాగుతుంది అని చెప్పక తప్పదు.