రాజశేఖర్ ‘కల్కి’టీజర్ ఎలా ఉందంటే

చాలా కాలం తర్వాత ‘గరుడవేగ’తో మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు హీరో రాజశేఖర్‌. ఆ ఊపులో మరో యాక్షన్ చిత్రం‘కల్కి’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో … అదాశర్మ హీరోయిన్. నందితా శ్వేత, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌, రాహుల్‌ రామకృష్ణ, నాజర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు (సోమవారం) రాజశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్‌’కు శుభాకాంక్షలు అని విష్‌ చేశారు.

టీజర్‌లో రాజశేఖర్‌ చాలా పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించారు. వర్షంలో ఒక చేత్తో గొడుగు పట్టుకుని, మరో చేతితో ఫైట్‌ చేసే సన్నివేశం హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘కల్కి’ చిత్ర యూనిట్ తోపాటు రాజశేఖర్‌ కుటుంబం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది.

Kalki Rajasekhar Birthday Teaser | Rajasekhar | Prasanth Varma | #KalkiTeaser

ప్రశాంత్‌ వర్మ ‘అ!’ సినిమాతో టాలెంట్ ఉన్న దర్శకుడిగా మంచి పేరును సంపాదించాడు. తన తదుపరి చిత్రంగా.. 1980 నేపథ్యంలో సాగే డిఫరెంట్‌ స్టోరీతో కల్కి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించి 30 శాతం షూటింగ్‌ మిగిలి ఉందని చిత్ర యూనిట్ పేర్కొంది.‌

శివానీ శివాత్మిక మూవీస్‌ పతాకంపై సి. కల్యాణ్, శివానీ, శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.‌ శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) కీలకపాత్రల్లో నటిస్తున్నారు.