ఇంట్రస్టింగ్ :రాజశేఖర్ ‘కల్కి’ టీజర్

‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు యాంగ్రీమెన్‌ రాజశేఖర్‌. దాంతో తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్త వహిస్తూ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీకి సంబంధించి ఓ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

మోషన్‌ పోస్టర్స్‌తోనే సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేశారు మేకర్స్‌. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్రయూనిట్‌. ఈ రోజు (ఏప్రిల్‌ 10) ఉదయం 10:10:10 (పది గంటల పది నిమిషాల పది సెకన్ల)కు మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేసింది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Kalki Official Teaser | Rajasekhar | Prasanth Varma | #KalkiTeaser

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆదాశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. దశావతారాల్లో ‘కల్కి’ 10వ అవతారం కావడం వల్లనే ఈ ముహూర్తాన్ని సెట్ చేసినట్టు చిత్ర యూనిట్ పేర్కొనడం విశేషం. రాజశేఖర్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు. ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు.