రజనీ ‘సూపర్ స్కెచ్’ కు మురగదాస్ కు సౌండ్ లేదట

గత కొద్ది నెలలుగా రజనీకాంత్‌ స్పీడు పెంచారు. ఈ సంవత్సరం ఆయనకు ఇప్పటికే ‘కాలా’, ‘2.0’ విడుదలయ్యాయి. వచ్చే సంవత్స రం ప్రారంభం 2019 జనవరిలో సంక్రాంతి కానుకగా ‘పేట్ట’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా ఆయన మరో సినిమా ఓకే చేసారు.

పేట్ట విడుదలైన కొన్నాళ్లకు మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుకానుంది. ఈ చిత్రానికి పక్కా మాస్‌ సబ్జెక్ట్‌ సిద్ధమవుతోందని చెన్నై సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం చిన్న బ్రేక్‌ తీసుకున్న రజనీ…. వచ్చే ఏడాది మార్చి నుంచి కొత్త చిత్ర పనులను షురూ చేస్తారు.

2019 ఆఖరునగానీ, 2020లోగానీ ఈ సినిమాను విడుదల చేయాలన్నది మురుగదాస్‌ ప్లాన్‌ అని తెలుస్తోంది. ‘2.0’ని తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్‌ రజనీ తాజా చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం.

అవినీతిపై పోరాటం చేసే కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందట. ఈ సినిమా రజనీ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా తీర్చి దిద్దుతున్నారట. ఈ సినిమాలో రజనీ ముఖ్యమంత్రిగా కనిపిస్తారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి అయితే తాను ఏం చేస్తానో..ప్రజలకు చెప్పేందుకే ఓ మానిఫెస్టోలా ఈ సినిమా ఉండాలని ఆయన మురగదాస్ ని ఆదేశించినట్లు సమాచారం. సినిమా హిట్ అవ్వాలి ..అదే సమయంలో తన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కు కూడా ఈ సినిమా సపోర్ట్ ఇవ్వాలి. అది రజనీ స్కెచ్.