2008లో బాలీవుడ్‌ను షేక్ చేసిన భారీ హిట్ ‘గజిని’. ఆమిర్ ఖాన్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, మురుగదాస్ స్టోరీ టేకింగ్‌తో ఈ సినిమా అప్పటివరకు బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ ప్లాన్‌లో ఉన్నట్టు మురుగదాస్ వెల్లడించడంతో సినీప్రపంచం మరల ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మురుగదాస్ ‘సికందర్’ అనే హిందీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. రంజాన్ సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా విజయం మీదనే ‘గజిని-2’ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ‘సికందర్’ సక్సెస్ అయితేనే ఆమిర్ ఖాన్ మళ్లీ మురుగదాస్ మీద నమ్మకం పెట్టుకుని ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మురుగదాస్, ఆమిర్ ఖాన్ ముంబయిలో కలసి గజిని-2తో పాటు కొన్ని కొత్త ఐడియాలపై కూడా చర్చించారని మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
కానీ ఇద్దరూ తాము చేస్తున్న సినిమాల్లో బిజీగా ఉండటంతో ఇప్పటివరకు ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని చెప్పాడు. ఆమిర్ ఖాన్ గత చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ ఘోరంగా ఫెయిల్ అయిన నేపథ్యంలో… ఇప్పుడు అతను చేసే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. అందుకే మురుగదాస్ డెలివర్ చేసే ‘సికందర్’పై ఆయన కూడా ఓ కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘గజిని-2’ ఇప్పుడు మళ్లీ చర్చలోకి రావడం ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్. కానీ ఈ విషయంపై క్లారిటీ రావాలంటే, ముందుగా ‘సికందర్’ విజయం సాధించాలి.