సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే దర్బార్ తో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలాకాలం తర్వాత సూపర్ స్టార్ కి సిసలైన సక్సెస్ ఇది. బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల వసూళ్లను రాబట్టింది. తమిళ్ సహా తెలుగులోనూ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక సూపర్ స్టార్ సినీ కెరీర్ కూడా చరమాంకానికి చేరుకుంది. ఆయన ఏక్షణమైనా రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీ కానున్నారు. ఈనేపథ్యంలో ఉన్న సమయంలో వీలైనన్ని సినిమాలు చేయాలని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వివేగం దర్శకుడు శివతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా అనంతరం మరో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో కూడా పనిచేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు సమాచారం. లోకేష్ ఇటీవలే ఖైదీ సినిమతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ మంచి విజయం సాధించింది. కార్తీకి చాలా గ్యాప్ తర్వాత ఓ భారీ విజయం దక్కింది. ఇక ఈ సినిమా మేకింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలా సూపర్ స్టార్ దృష్టిలో కూడా పడటంతోనే ఆయన 169వ చిత్రాన్ని లోకేష్ తో చేయాలని నిర్ణయించుకున్నారుట. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ విజయ్ తో మాస్టర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రజనీ-లోకేష్ కనకరాజ్ ప్రీ అవ్వగానే ఈ కాంబో సెట్స్ కు వెళ్లనుంది.