ఒక నటుడుగా స్టార్ట్ అయ్యి కెరీర్ లో ఎలా సెటిల్ అవుతారని చెప్పడం ఎవరి వల్ల కూడా కాదని చెప్పాలి. అలా తమిళ ఇండస్ట్రీలో ఒక వెర్సిటైల్ నటుడుగా పేరు తెచ్చుకున్న నటుడు మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి కోసం చెప్పుకొని తీరాలి.
కేవలం చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కనిపించిన తాను ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ పైడ్ విలన్ గా మారుతాడని ఎవరూ అనుకోరు. ఇప్పుడు తనని విలన్ గా ఓ సినిమాలో పెట్టుకోడానికి డిమాండ్ ఏ లెవెల్లో ఉందో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వక మానదు.
లేటెస్ట్ గా భారీ హిట్ సినిమా “విక్రమ్”, “మాస్టర్” చిత్రాల్లో సాలిడ్ విలన్ పాత్రలు అంతకు మించి తన నటనతో ఆకట్టుకున్న సేతుపతి ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ అందుకున్నాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ షారుఖ్ ఖాన్ తో తమిళ దర్శకుడు అట్లీ “జవాన్” అనే భారీ ఏక్షన్ సినిమాని తీస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి లాక్ కాగా ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఈ సినిమాకి ఏకంగా తానైతే 22 కోట్లు తీసుకుంటున్నాడట. దీనితో ఇండియన్ సినిమా దగ్గర అయితే ఇప్పుడు అత్యధిక పారితోషకం అందుకుంటున్న విలన్ ఆర్టిస్ట్ గా తాను నిలిచాడని అంటున్నారు. ఒక విలన్ పాత్రకి 22 కోట్లు అంటే అసలు ఇది చిన్న విషయం కూడా కాదు అలాగే తనకి ఉన్న డిమాండ్ కోసం కూడా అర్ధం చేసుకోవాలి.