ఏఎన్ఆర్ బయోపిక్ బోరింగ్ అంటున్న నాగార్జున.. అప్ కమింగ్ మూవీస్ లేటెస్ట్ అప్డేట్స్!

బయోపిక్స్ తీస్తే మినిమం గ్యారంటీ హీట్ అనే భావనలో ఉంటారు చాలామంది మూవీ మేకర్స్. అందుకే వాళ్ళు బయోపిక్స్ తీయటానికి ఇష్టపడతారు. తెలుగులో కూడా ఇలాంటి బయోపిక్ మినిమం గ్యారంటీ అని చాలాసార్లు నిరూపించుకున్నాయి. మహానటి బయోపిక్ అయితే హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో చాలామంది నటుల బయోపిక్స్ వచ్చాయి కానీ నటుడు ఏఎన్నార్ బయోపిక్ ఇప్పటివరకు రాలేదు. ఈ విషయంపై నాగార్జున ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం నాగార్జున ఫ్యామిలీ గోవాలో ఉంది అక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్లో ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలని సెలబ్రేట్ చేస్తూ ఒక స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో అక్కినేని కుటుంబ సభ్యులందరూ పాల్గొటం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు క్లాసిక్ సినిమాలోని క్లాసిక్ బిట్స్ ని ప్లే చేసిన అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడారు. అక్కడ ఏఎన్ఆర్ బయోపిక్ పై మళ్లీ టాపిక్ వచ్చింది అయితే నాగార్జున మాట్లాడుతూ ఏఎన్ఆర్ బయోపిక్ బోరింగ్ గా ఉండవచ్చు, బయోపిక్ అంటే ఆప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే బాగుంటుంది కానీ ఆయన లైఫ్ గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతూనే వచ్చింది.

సినిమాలో కొంత కల్పన ఉండాలి ఇవేమీ లేకుండా బయోపిక్ తీస్తే బోరింగ్ గా ఉంటుంది. దాని కన్నా బయోపిక్ తీయకపోవటమే మంచిది, కానీ ఆయన జీవితం పై ఒక డాక్యుమెంటరీని రూపొందించే ఆలోచనలో ఉన్నాము, అందులో ఆయన పూర్తి జీవితాన్ని చూపిస్తామని చెప్పాడు నాగార్జున. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో అంతర్జాతీయ సౌకర్యాలతో ఏర్పాటుచేసిన డాల్బీ స్టూడియోస్ గురించి కూడా వివరించారు.

దాంతోపాటు రాబోయే తన అప్ కమింగ్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. కుబేర సినిమాలో ఈయన కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే దాంతోపాటు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో కూడా నాగార్జున ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ ఈ తరం దర్శకులలో లోకేష్ కనకరాజ్ ద బెస్ట్ అని చెప్పుకొచ్చారు.