19న విడుదలకు విజయ్‌ ‘లియో’ సన్నాహాలు

కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ’లియో’. త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్‌ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ ప్రోమో గ్లింప్స్‌, ఫస్ట్‌ సింగిల్‌ లాంచ్‌ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘లియో’ మూవీ ట్రైలర్‌కు సంబంధించి ఒక సాలిడ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ చిత్రం ట్రైలర్‌ను అక్టోబర్‌ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డేట్‌ అయితే చెప్పారు కానీ ట్రైలర్‌ టైం చెప్పకపోవడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఒక సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇక ’మాస్టర్‌’ తర్వాత విజయ్‌`లోకేశ్‌ కాంబోలో వస్తోన్న రెండో చిత్రమిది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. సెన్సార్‌ లియో సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్‌ సోషల్‌ విూడియాలో తెలిపారు. రెండు గంటల నలభై నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఇక రన్‌ టైమ్‌ ఈ సినిమాకు కలిసొచ్చేలానే ఉంది