కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా పట్టి పీడిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. భారత్ లోనూ కరోనా దాడి అంతకంతకు పెరిగిపోతుంది. 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి విపత్తులు తలెత్తుంటాయి. అలాంటి జాతీయ విపత్తును ఇప్పుడు భారత్ లో నేటి జనరేషన్ ప్రత్యక్షంగా చూస్తుంది. వైరస్ లు దాడి చేస్తే ఎలా ఉంటుందన్నది ఇప్పటివరకూ హాలీవుడ్ సినిమాల్లోనే చూసాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. టెక్నాలజీ ఎంత అభివృద్ది చెందినా..ఆ మహమ్మారిని మాత్రం శాశ్వతంగా మట్టు బెట్టే వ్యాక్సిన్ ఇప్పటివరకూ కనుగోనలేదు. ఇదే ఇప్పుడు మానవాళి మనుగడకు పెను సవాల్ గా మారింది. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందన్నది శాస్ర్తవేత్తలు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
అంటే అప్పటివరకూ మనిషికి మనిషే శత్రువు. ఇప్పటికే ఈ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని హాలీవుడ్ సహా టాలీవుడ్ లో స్ర్కిప్ట్ లు రెడీ అవుతున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. కరోనా వైరస్ పై జక్కన్న చూపు కూడా పడిందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా పై సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారుట. వ్యాక్సిన్ ఎలాగూ ఇప్పట్లో్ సాధ్యం కాదు కాబట్టి! ఈ సమయంలో మంచి స్ర్కిప్ట్ సిద్దం చేయిస్తే బాగుంటుందని ఓ ఐడియా తట్టిందిట. ఎలాగూ తండ్రి విజయేంద్ర ప్రసాద్ పాన్ ఇండియా రైటర్.
జక్కన్న అంతర్జాతీయ స్థాయిలో చిత్రాలు తీసే గొప్ప టెక్నీషియన్. వీళ్లిద్దరు కలిస్తే ఆ స్ర్కిప్ట్ హాలీవుడ్ స్థాయిలో ఎందుకుండదు? సినిమా ఎందుకు చేయలేరు అన్న ఓ టాపిక్ ఇప్పుడు పరిశ్రమలో నడుస్తోంది. బాహుబలితో తండ్రీ కొడుకులిద్దరు దేశ విదేశాల్లోనే తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పారు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నారు. జక్కన్న బాలీవుడ్ కి తీసుకెళ్లిపోవాలని కరణ్ జోహార్ లాంటి వారు స్కెచ్ వేసి రెడీగా ఉన్నారు. జక్కన్నతో పని చేయాలని అమీర్ ఖాన్ లాంటి వాళ్లే వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
