దర్శక ధీరుడు రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనా నుంచి బయట పడ్డ రాజమౌళి మీడియాతో బాగానే ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ మధ్య ప్లాస్మా డొనేషన్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక లోకల్, నేషనల్ మీడియాతోనూ రాజమౌళి బాగానే ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, ఆది పురుష్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ సాధ్యాసాధ్యాలపై మాట్లాడాడు.
సెప్టెంబర్‌లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నట్టు రాజమౌళి తెలిపాడు. అయితే షూటింగ్ మొదలెట్టిన రెండు మూడు వారాల్లోనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నాడు. వాటికి సంబంధించిన పార్ట్‌నే షూట్ చేయబోతోన్నట్టు వెల్లడించాడు. ఇక అదే సందర్భంలో ప్రభాస్ గురించి, ఆది పురుష్ ప్రాజెక్ట్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
ఆది పురుష్ ఫస్ట్ లుక్ ఎప్పుడో చూశానని రాజమౌళి తెలిపాడు. రాముడిగా ప్రభాస్ సరిగ్గా ఫిట్ అయ్యాడని ప్రశంసలు కురిపించాడు. ఈ పాత్రను పోషించడానికి ప్రభాస్‌కు ఇదే సరైన సమయం. ఇంతకంటే మంచి సమయం వేరే ఉండదని అన్నాడు. ఈ మధ్యే ఆయోధ్య రామ మందిరం భూమి పూజ ఎంత ఘనంగా జరిగిందో చూశామని దేశమంతా రామ నామ స్మరణతో మార్మోగిపోయిందని అన్నాడు. రాముడిగా ప్రభాస్ ను చూసి దేశం మురిసిపోతుందని తెలిపాడు. సినిమా గురించి చాలావిన్నానని.. అది చాలా గొప్పగా ఉండబోతోందని రాజమౌళి పేర్కొన్నాడు.