“రథం” చిత్రానికి సెన్సార్ అయ్యింది

రాజగురు ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన “రథం “సినిమాను చూసిన సెన్సార్ వారు ఈరోజు దీనికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు . చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రాజా ధారపునేని ఈ సినిమా నిర్మించాడు . అంతా కొత్త వారితో ఈ సినిమా తీయడం విశేషం . దర్శకుడు చంద్ర శేఖర్ కానూరి గతంలో చంద్ర శేఖర్ ఏలేటి , రాజమౌళి దగ్గర పని చేశాడు . తొలిసారి “రథం “అనే సినిమా రూపొందించాడు . అర్జున్ రెడ్డి మరికొన్ని సినిమాల ప్రేరణతో ఈ సినిమా నిర్మించినట్టు అనిపించింది .
దేశానికి వెన్నెముక రైతు అని హీరో కార్తీక్ చెప్పడం బాగుంది. అలాగే ప్రేమ అంటే వ్యామోహం కాదు . నిజమైన ప్రేమ జీవితాంతం తోడు వుంటుందనే సందేశం ఇచ్చే సినిమా రథం . అలాగే కాల్ మనీ మాయలో పది ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో చెప్పే ప్రయత్నం చేశారు . చిన్న పిల్లతో వెట్టి చాకిరీ మీద కూడా చక్కటి సందేశం ఈ చిత్రంలో ఇవ్వడం శుభ పరిణామం . కేవలం ప్రేమ మాత్రమే కాకుండా ప్రతి యువకుడుకు సామాజిక భాద్యత ఉందని ఈ చిత్రంలో చెప్పడం జరిగింది . కొత్తవారు తీసిన ఓ మంచి సినిమా “రథం”
ఈ సినిమాలో గీతానంద్ , నవీన్, రాజ్ ముదిరాజ్, ఎన్ . రామ్, చాందిని భార్గవీ , మాధవి , ప్రమోదిని మొదలైన వారు నటించారు .