అందరూ కలిసి ఒకడిని పిచ్చోడిని చేయడం, వాడిపై సెటైర్స్ వేయడం, వాడిని నానా మాటలు అనడం తద్వారా మిగతా వారిని ఎంటర్టైన్ చేయడం ఎప్పటి నుంచి వస్తున్న పద్దతే. ఇక బుల్లితెరపై ఇలాంటి వాటికి కొదవే లేదు. ఇక జబర్దస్త్ లాంటి షోల్లో అయితే జరిగేది ఇదే. బక్కగా ఉందనో, నల్లగా ఉన్నాడనో, లావుగా ఉన్నాడనో ఏదో రకంగా కామెంట్స్ చేస్తూ ఫన్ క్రియేట్ చేస్తుంటారు. వీరందరిలో సుధీర్‌ను వెరైటీగా టార్గెట్ చేస్తుంటారు. అమ్మాయిల పిచ్చి ఉన్నోడిలా సుధీర్ ప్రవర్తించడం, ఎదుటి వారు కూడా అలానే చిత్రీకరించడంతో అందరికీ ఓ ముద్ర పడిపోయింది.
ఇక పండుగలకు చేసే స్పెషల్ ఈవెంట్లలో సుధీర్‌ను ఎలా వాడుకుంటారో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. జబర్దస్త్ టీమ్ మేట్స్ చేసే స్పెషల్ ఈవెంట్లలో సుధీర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. వినాయక చవితికి 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే ఓ స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు. అందులో మళ్లీ సుధీర్‌ను బాగా వాడారని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ విన్నర్ రాహులో నోరు ఎలాంటిదో తెలిసిందే కదా. సుధీర్‌ను స్కిట్స్‌లో భాగంగా ఇష్టమొచ్చినట్టు తిట్టేశాడు.
ఈ ఈవెంట్‌ను రాహుల్-పునర్నవి పెళ్లిపై ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. పున్నును లేపుకొచ్చానని, అన్న అయిన హైపర్ ఆదికి రాహుల్ చెప్పడం, చెల్లిని వెతుక్కుంటూ సుధీర్, శ్రీముఖి రావడం చూస్తూంటే ప్లాన్ ఏంటో అర్థం అవుతోంది. ఈ క్రమంలోనే సుధీర్‌ను హౌలేగాడు, గూట్లే అంటూ సెటైర్లు వేశాడు. అయితే వీటికి అక్కడ ఉన్నవారంత పగలబడి నవ్వారనుకోండి అది వేరే విషయం. ఇక ఇలా సుధీర్‌ను రాహుల్ అనడంతో ప్రోమో కూడా తెగ వైరల్ అవుతోంది. మరి ఇలాంటి కామెంట్లను సుధీర్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో.. అంతా ఎంటర్టైన్మెంట్ అని లైట్ తీసుకుంటారో లేదో చూడాలి.