“సినిమాను రిపేర్ చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాం. కానీ మా ప్రయత్నాలు సఫలం కాలేదు. సినిమాకు ఈ రిజల్ట్ వస్తుందని ముందే ఊహించాను. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచారం చేశాం. నిన్న థియేటర్లలో మీ చేదు అనుభవానికి నేను క్షమాపణలు చెబుతున్నాను.” అంటూ క్షమాపణలు చెప్పారు కమెడీయన్ రాహుల్ రామకృష్ణ.
అర్జున్ రెడ్డి సినిమాతో బిజి అయ్యారు యంగ్ కమిడయన్ రాహుల్ రామకృష్ణ. నిన్న శుక్రవారం నాడు ఆయన మిఠాయి అనే డార్క్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. నూతన దర్శకుడు ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించారు.
ప్రియదర్శి కూడా చిత్రంలో కీలక పాత్ర పోషించారు. మిఠాయి చిత్రం డిజాస్టర్ అయ్యింది. ప్రేక్షకులని ఏ మాత్రం అలరించకపోగా, నమ్మి వెళ్లిన అభిమానులని నిరాశపరచింది. దీంతో సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిసింది. ఈ నేపధ్యంలో రాహుల్ తన ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలియజేస్తూ వరుస ట్వీట్స్ చేశారు.
ఆ ట్వీట్స్ లో ఆయన…మంచి సినిమాని మీ ముందుకు తెచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించాం. మా ప్రయత్నాలు ఫలించలేదు. సినిమా ఫలితాన్ని ముందుగానే అంచనా వేసాం. దర్శకుడి ఆలోచనలు ఆయన ఇమాజినేషన్‌ని తప్పక గౌరవిస్తాను. ఈ సినిమాతో నాకు జ్ఞానోదయం ఉంది. ఒత్తిడితో పనిచేస్తే సరైన రిజల్ట్స్ రావు అనేది బాగా తెలిసింది.
ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ రావడంతో నాకు వేల కొలది మెసేజ్‌లు వచ్చాయి. అవి నా హృదయాన్ని కదిలించాయి. మరోసారి నా స్నేహితుడు ప్రియదర్శితో కలిసి మంచి వినోదం అందిస్తానని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. మీ ప్రేమాభిమానులు ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అని రాహుల్ రామకృష్ణ ట్వీట్‌లో తెలిపారు.