ఎక్కడన్నా భావ గాని వంగ తోట కాడ మాత్రం కాదన్నాడట వెనకటి కొకడు. ఈ సామెత అక్షరాలా ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు వర్తిస్తుంది. సినిమా రంగంలో ఆయన సెట్ కు వస్తే అందరూ లేచి నిలబడతారు. నమస్కారాలు పెట్టేవాళ్ళు , కాళ్లకు మొక్కేవారు.
ఆ కిక్కు, ఆ ఆనందం వేరు. అదే బయట ప్రపంచంలోకి వస్తే చేదు అనుభవం చవి చూడవలసిందే అంటున్నారు ఓటర్లు. ఈరోజు ఉదయం దర్శకుడు రాఘవేంద్ర రావు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ సెంటర్ కు వచ్చారు.
సహజంగా ఫిలిం నగర్ సెంటర్ అనగానే ఎక్కువ మంది సినిమా వాళ్ళే వుంటారు. అదికాక అది సినిమా వాళ్లదే. రాఘవేంద్ర రావు వచ్చేటప్పటికి క్యూ పెద్దగా వుంది. క్యూలో ఒకరిద్దరు సినిమా వాళ్ళు తప్ప బయటివాళ్లే ఎక్కువ వున్నారు. రాఘవేంద్ర రావును చూడగానే అక్కడ డ్యూటీలో వున్నా కానిస్టేబుల్ నమస్కారం పెట్టి నేరుగా లోపలకు తీసుకెడుతున్నారు. క్యూ లో వున్న ఓటర్లు ఇది గమనించి క్యూలో రమ్మని అరిచారు.
దీంతో రాఘవేంద్ర రావు కంగు తిన్నాడు. పోలీస్ కానిస్టేబుల్ మాత్రం “రండి సార్ ” అని పిలుస్తున్నాడు. లోపల కాలు పెట్టేంతలో మరొక గొంతు వినబడింది. దాంతో రాఘవేంద్ర రావు వెనక్కు వచ్చి క్యూలో నిలబడ్డాడు. అప్పుడాయన ముఖంలో రంగులు మారిపోయాయి. కాసేపు క్యూలో నుంచొని ఓటు వెయ్య కుండావే వెళ్ళిపోయాడు.
పాపం దర్శకేంద్రుడు . అందరినీ ఆయన డైరెక్ట్ చేస్తే ఆయన్ని మాత్రం ఓటర్లు డైరెక్ట్ చేశారు కదూ ? ఉదయం ఓటు వెయ్యకుండావే వెళ్లిపోయాననే వార్త రావడం దురదృష్టకరమని , తనకి కోపం వచ్చి వెళ్లలేదని పని వుంది వెంటనే వెళ్లిపోయానని వివరణ ఇచ్చాడు . తానూ ఓటు హక్కు వినియోగించుకున్నానని సిరా గుర్తు వున్న చూపించాడు