బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక నెపోటిజం (బంధుప్రీతి) కారణమంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారకులుగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్ లను నిందించడం పరిపాటిగా మారింది. ప్రతిభగల వారికి అవకాశాలు ఇవ్వకుండా..ట్యాలెంట్ ని తొక్కడంలో ఈ ముగ్గరు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ డిబేట్ నడుస్తోంది. కంగనా రనౌత్, పర్హాన్ అక్తర్, ప్రకాష్ రాజ్ లాంటి వారు పెట్టిన పోస్ట్ లు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో సుషాంత్ మనస్థాపానికి అసలు కారణం పరిశ్రమ పెద్దలే అంటూ మంట రెగుతోంది.
తాజాగా ఓ ఛానల్ కు జూమ్ యాప్ ద్వారా ఇంటర్వూ ఇచ్చిన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సుషాంత్ ఆత్మహత్యపై స్పందించారు. సుషాంత్ మరణానికి కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. అది అతని వ్యక్తిగత విషయం. బాలీవుడ్ లో నెపోటిజం కారణంగా సుషాంత్ చనిపోయాడు అన్నది దారుణంగా చెప్పుకొచ్చారు. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్ న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుటారు. సుషాంత్ ని ఆ ముగ్గురు ఎంకరేజ్ చేసారు కాబట్టే అతను ఆ స్థానానికి చేరుకున్నాడు. అసలు ఓ కొత్త వ్యక్తి అందరికి తెలిసాడంటే కారణం పరిశ్రమలో ఉన్న పెద్దల వల్లే. వీళ్లు అవకాశాలు ఇవ్వకపోతే సుషాంత్ ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.
టాలీవుడ్ లో అయినా , కోలీవుడ్ లో అయినా ఎక్కడా నెపోటిజం అనేది ఉండదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి మహా అయితే 50 మంది హీరోలు వచ్చారనుకుందాం. మరి మిగతా హీరోలంతా ఎక్కడ నుంచి వచ్చినట్లు? వాళ్లకు పరిశ్రమలో ఉన్న పెద్దవాళ్లంతా అవకాశాలు ఇవ్వకుండా స్టార్లు అయిపోయారా? అని ప్రశ్నించారు. నెపోటిజం అనేది ఏ పరిశ్రమలోనూ లేదు. ఇండస్ర్టీలో ఎవరైనా కష్టాలు పడాల్సిందే. ఆ తర్వాత ట్యాలెంట్…అదృష్టం కలిసి రావాలి. ఆ రెండు లేకపోతే పరిశ్రమలో రాణించలేరు అని అభిప్రాయపడ్డారు. సుషాంత్ మరణం పై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు…బాలీవుడ్ నుంచి ఆ ముగ్గుర్ని దోషులుగా చిత్రీకరించి ఇంకొంత మంది బాలీవుడ్ నటులు మాట్లాడటం అత్యంత దారుణంగా ఉందన్నారు.