‘భోళా శంకర్’- డబ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ భోళా శంకర్’ టీజర్‌లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించి అందరినీ అలరించారు మెగాస్టార్. ఇటివలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మెగా స్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.

”సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది! మీ క్యాలెండర్‌ లను మార్క్ చేసుకోండి! థియేటర్స్ లో కలుద్దాం! # భోళాశంకర్ ఆగస్టు 11” అని ట్వీట్ చేశారు మెగాస్టార్.

ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. మిగిలిన పాటలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలౌతాయి. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

డడ్లీ డీవోపీ గా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్