దర్శకేంద్రుడుని టార్గెట్ చేస్తున్న పృథ్వీ, ఏం జరిగింది?

దర్శకేంద్రుడుని టార్గెట్ చేస్తున్న పృథ్వీ, ఏం జరిగింది?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌ (ఎస్వీబీసీ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎస్వీబీసీ చైర్మన్‌, నటుడు పృథ్వీరాజ్‌ తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఆయన ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ.. ఛానల్‌లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఇక అవినీతి అక్రమాల విషయంలో గత ఛైర్మన్‌ రాఘవేంద్రరావు ఉన్నా విచారణ తప్పదని వ్యాఖ్యానించారు. దాంతో టాలీవుడ్ వర్గాల్లో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. రాఘవేంద్రరావు, అవినీతి అంటూ ఒకటికి నాలుగు సార్లు టార్గెట్ చేయటం పద్దతి గా లేదని అంటున్నారు. రాఘవేంద్రరావు అవినీతి చేస్తే అది చూపించి మాట్లాడాలి కానీ ఇలా నిందలు మోపే రేతీలో టాలీవుడ్ కు చెందిన వ్యక్తిగా…ఓ దర్శకుడు గురించి ఇలాంటి నిందలు వేయటం పద్దతి కాదంటున్నారు.

అలాగే…‘‘కొండపై రాజకీయాలు చేయను. కొండపై పార్టీలు, జెండాల గురించి మాట్లాడను. కేవలం అజెండాలపైనే మాట్లాడతా. ఎస్వీబీసీ ఉద్యోగులను కుటుంబంలా భావించి, నేను కూడా ఐడీ కార్డు ధరించా. ఛైర్మన్‌ సంస్కృతిని మార్చా. ఎందుకంటే ఏకలవ్య శిష్యుడిలా స్వామివారిని కాపాడుకోవడమే నా కర్తవ్యం.

అక్రమాల విషయంలో రాఘవేంద్రరావు ఉన్నా, ఇంకెవరైనా ఉన్నా నాకు అనవసరం. నాకు ఎవరితోనూ విభేదాలు లేవు. ఒక వేళ పృథ్వీరాజ్‌ అక్రమాలకు పాల్పడినా జగన్మోహన్‌రెడ్డి విచారణ జరిపిస్తారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి జగన్‌గారి కాళ్లు పట్టుకోమన్నా పట్టుకుంటా. కార్మికులు బాగుండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. వారి హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోవాలని నా కోరిక’’ అని చెప్పుకొచ్చారు.