షాకింగ్: ప్రియాంక చోప్రాకి 77 కోట్ల రెమ్యూనరేషన్

ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా హీరోలకంటే హీరోయిన్ల రెమ్యూనరేషన్ తక్కువ ఉంటుంది. బాలీవుడ్ లో హీరోలకంటే కథానాయికలకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారంటూ అప్పుడడిప్పుడు హీరోయిన్స్ వాపోతుంటారు కూడా. కానీ ప్రియాంక చోప్రా వీటికి చెక్ పెట్టింది.

హీరోలకంటే తను ఎక్కువ సంపాదిస్తుంది. గతేడాది ప్రియాంక చోప్రా 77 కోట్ల రూపాయల సంపాదనతో హీరోలను దాటేసింది. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక ఫోర్బ్స్ వెల్లడించింది.

సినిమాలు, ఎండార్స్మెంట్ డీల్స్ ద్వారా ఈ డబ్బును సంపాదించింది ప్రియాంక. హాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకున్న ప్రియాంక అక్కడ సినిమాలతోపాటు, టెలివిజన్ షోలలో కూడా పాల్గొంటుంది.

సినిమాలకు, టీవీ షోస్, ఎండార్స్మెంట్ డీల్స్ కి 2017 లో ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ 77 కోట్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. అయితే సంపాదించిన మొత్తంలో 21 కోట్ల రూపాయలు పన్ను చెల్లించగా మిగిలిన 56 కోట్లు తన ఖాతాలో పడ్డాయి.