24ఏళ్ల ఈ అందాలరాశి తన మొదటి సినిమాగా కన్నడంలో ‘ఒంద్ కథే హెళ్ల’ అనే సినిమాలో నటించింది. గిరీశ్ గిరిజాజోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీక్ రావు హీరోగా నటించాడు. తండ్రి అరుల్ మోహన్.
తెలుగు సినిమా పరిశ్రమకు నాని హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాకుండానే మరో రెండు సినిమాలకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా, కిషోర్‌రెడ్డి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘శ్రీకారం’ సినిమాకు ఈ అమ్మాయి సైన్ చేసినట్టుగా తెలిసింది. అలాగే, అఖిల్ అక్కినేని కథానాయకుడుగా, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో రూపొందబోయే చిత్రంలో కూడా ఈ అమ్మడినే హీరోయిన్‌గా తీసుకోవాలని ఫిక్సయ్యారట. తమిళంలో కూడా ఈ ఏడాదే రాజేశ్ కన్నన్ దర్శకత్వంలో ‘ది మాయన్’ అనే చిత్రంలో నటించేందుకు తన అంగీకారం తెలిపింది.తెలుగు పరిశ్రమను ఓ ఊపు ఊపేలా కనబడుతోంది. ఏదేమైనా ‘గ్యాంగ్‌లీడర్’ విడుదలయితేనే గానీ, ఈ అమ్మాయి భవిష్యత్తేంటో ఊహించలేం