“బాహుబలి”తో నటించే అరుదైన అవకాశం … డోంట్ మిస్ !

ప్రభాస్ .. ఈ పేరు ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలకి పోయి అడిగినా కూడా టక్కున గుర్తు పట్టేస్తారు. బాహుబలి తో ప్రభాస్ క్రేజ్ అమాంతం ఆకాశాన్ని తాకేలా పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మద్యే ప్రభాస్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో సాలార్ చిత్రం రూపొందుతుంది అని ప్రకటించారు.

సలార్‌: ఆడిషన్‌ కాల్‌-వయసుతో సంబంధం లేదు!

ఈ పవర్ ‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంలో నటించాలనుకుంటున్నారా? అయితే ఈ సువర్ణావకాశం మీకోసమే. అతి త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు వన్‌ మినిట్‌ వీడియోతో ఈ నెల 15న హైదరాబాద్‌, శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనున్న ఆడిషన్ లో పాల్గొనండి.

ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఈ ఆడిషన్స్‌ జరగనున్నాయి. త్వరలో బెంగళూరు, చెన్నైల్లోనూ ఆడిషన్స్‌ జరగనున్నాయని దర్శకుడు తెలియజేశారు.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్నారు. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే సందడి చేయనున్నారు.