ప్రభాస్ మార్కెట్ ఎంతో తెలుసా?:: ఈ లెక్క చూస్తే బాలీవుడ్ హీరోలకి జ్వరం గ్యారెంటీ

prabhas wants to extend his market beyond bollywood stars

ప్రభాస్.. రోజురోజుకూ ఈ హీరో మార్కెట్ పెరిగిపోతోంది. ఎంతలా అంటే టాలీవుడ్ హీరోలే కాదు.. బాలీవుడ్ బిగ్ హీరోలు కూడా అందుకోలేనంత. నిజానికి బాహుబలి కంటే ముందు ప్రభాస్ ఒక టాలీవుడ్ స్టార్ మాత్రమే. కానీ.. బాహుబలిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయ్యాడు. బాహుబలి రెండు సిరీసులు అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రభాస్ కు తిరుగులేకుండా పోయింది.

prabhas wants to extend his market beyond bollywood stars
prabhas wants to extend his market beyond bollywood stars

దీంతో ప్రభాస్ తన సినిమాలన్నీ పాన్ ఇండియా లేవల్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. సాహో కూడా పాన్ ఇండియా మూవీనే. అయితే సాహో తర్వాత ప్రభాస్ కాస్త గ్యాప్ ఇచ్చాడు. కానీ.. సాహో లాంటి ఒక ప్లాఫ్ సినిమా తర్వాత కూడా ప్రభాస్ కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయంటే అది మామూలు విషయం కాదు.

అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ప్రభాస్ కంటే పెద్ద స్టార్లు ఉన్నారు. కానీ.. వాళ్ల కంటే కూడా తన రూటు సెపరేట్ అంటూ దూసుకెళ్తున్నాడు ప్రభాస్.

ఇక.. ఆదిపురుష్ సినిమా ప్రకటించగానే బాలీవుడ్ లో ప్రభాస్ పేరు మార్మోగిపోతోంది. ఎందరో బాలీవుడ్ స్టార్ల సినిమాలు ప్రారంభం అయినప్పుడు కూడా ఇంత భారీగా చర్చ జరగలేదు. కానీ.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మీద మాత్రం మామూలు చర్చ జరగడం లేదు. ఈ సినిమాతో ప్రభాస్ మార్కెట్ కూడా విపరీతంగా విస్తరించనున్నదట.

ప్రస్తుతం ప్రభాస్ కు సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. సౌత్ ఇండియాలో చిన్నారులు కూడా ప్రభాస్ కు ఫ్యాన్సే. ఇప్పుడు బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. చిన్నారులు కూడా ప్రభాస్ కు వీరాభిమానులు అయిపోతారు అంటూ బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఆదిపురుష్ సినిమాను 3డీలో తెరకెక్కిస్తుండటం.. అందులోనూ అది రామాయణ ఇతిహాసం కావడంతో ఆ సినిమా ఖచ్చితంగా చిన్నారులకు నచ్చుతుంది. దీంతో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకాస్త పెరుగుతుంది. అంటే నార్త్ లోనూ ప్రభాస్ కు మార్కెట్ పెరుగుతుంది కదా.

రోజురోజుకూ ఇలా తన మార్కెట్ ను విస్తరింపజేకుంటూపోతుంటే.. ప్రభాస్ ను అందుకునే మరో నటుడు ఎవ్వరు. సౌత్ లోనే కాదు.. నార్త్ లో కూడా ప్రభాస్ ను ఇప్పట్లో అందుకునే నటుడు లేడని సినీ ఇండస్ట్రీ కోడై కూస్తోంది.