‘సాహో’ టీం నుంచి ఇంకో సర్‌ప్రైజ్‌

ప్రభాస్ ‘సాహో’ గేమ్ ట్రైలర్ 

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో. ఈ నెల 30 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈసినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే టీజర్‌ ట్రైలర్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సాహో గేమ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ట్రైలర్‌ను విడుదల చేశాడు. సినిమా తరహాలోనే ఈ గేమ్ కూడా ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.

Saaho The Game Trailer | Prabhas | Shraddha Kapoor | Sujeeth | Ghibran | UV Creations

యాక్షన్ జానర్‌లోరూపొందించిన ఈ గేమ్‌లో లీడ్ క్యారెక్టర్‌గా ప్రభాస్‌ కనిపిస్తున్నాడు. ఇంటెన్స్‌ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌తో రూపొందించిన ఈ గేమ్ టీజర్‌కు మంచి రెస్సాన్స్‌ వస్తోంది. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్, చుంకీ పాండే, అరుణ్ విజయ్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి, మహేష్‌ మంజ్రేకర్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.