ఇండియన్ సినిమా నుంచి ఇప్పుడు చాలా తక్కువ సినిమాలే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునేవి ఉన్నాయని చెప్పాలి. వాటిలో అయితే ఇప్పుడు దర్శకుడు రాజమౌళి తీస్తున్న సినిమాలు భారీ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటుండగా తన సినిమాలతో మరింత లెవెల్ లోకి వెళ్లినటువంటి స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా అంతే లెవెల్లో ఇండియన్ సినిమాలు ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్తున్నాడు.
అలా ఇప్పుడు తాను వరల్డ్ లెవెల్లో చేస్తున్న సినిమా “ప్రాజెక్ట్ కే”. దర్శకుడు నాగ్ అశ్విన్ తో 500 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ఒక స్కైఫై ఫాంటసీ డ్రామాలా ఉంటుంది అని దర్శకుడు రివీల్ చేసాడు కానీ ఎగ్జాక్ట్ గా సినిమా అయితే ఎలా ఉంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు.
కాకపోతే సినిమా కథలో మన దేశపు గతం అలాగే భవిష్యత్తులో భారతదేశం కనిపిస్తుంది అని పలు ఆసక్తికర అంశాలు బయటకి వచ్చాయి. అంటే మన దేశంలో మహాభారతం కాలం నాటి విజువల్స్ అదే విధంగా ఒక 2500 నాటికి ఇండియాలో విజువల్స్ లాంటి తరహాలో కథ టైం ట్రావెల్ తరహాలో నడుస్తుంది అని గాసిప్స్ ఉన్నాయి.
అయితే వీటిలో ఓ అంశం నిజం అయ్యేలా కనిపిస్తుంది. తాజాగా నిన్న గణేష్ చతుర్థి సందర్భంగా మేకర్స్ తమ స్క్రిప్ట్ ని వినాయకుని దగ్గర పెట్టి ఒక పోస్ట్ పెట్టారు. ఇందులో ఆ కాలంలో వేద వ్యాసునికి మహా భారతం రాయడానికి సాయం చేసావు, ఇప్పుడు మా భారతానికి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. అంటే సినిమా స్టోరీ లైన్ లీకయ్యినట్టే అని మహాభారతం కూడా ఈ సినిమాలో ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.