డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 తర్వాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్ రౌత్ తో భారీ పాన్ ఇండియా సినిమాని ప్రకటించాడు. ఏ- ఆది పురుష్ అనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు. టీసిరీస్ ఈ చిత్రాన్ని దాదాపు 500-600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనుంది. 3డి విజువల్ గ్రాఫిక్స్ తో ఒక మహదాద్భుతంగా తెరకెక్కించి దేశంలోని అన్ని భాషలు సహా విదేశాల్లోనూ రిలీజ్ చేయనున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి స్ఫూర్తి ఏది? అంటే.. ఇప్పటికే రిలీజైన ప్రభాస్ లుక్ చూస్తుంటే ఇది మెలూహ తరహా లుక్ అని అర్థమవుతోంది. మెలూహ అనగానే హాలీవుడ్ మూవీ `ది ఇమ్మోర్ట్స్ ఆఫ్ మెలుహా` గుర్తుకు వస్తుంది. మెలూహ అనేది నాగుల రహస్యం. అమిష్ త్రిపాఠి దీనిపై పుస్తకాన్ని రచించారు. శివ ట్రయాలజీ పేరుతో ఇదివరకూ పుస్తకాల్ని రిలీజ్ చేశారు. మెలుహా ల్యాండ్స్ లో సాగే కథలో శివుని ప్రత్యక్ష దర్శనాన్ని విజువల్ వండర్ గా చూపించే వీలుంటుంది. నీలకంఠుని పూజించే మెలుహన్స్ కథాంశమా? అన్నదానిపైనా మరింత స్పష్ఠత రావాల్సి ఉంటుంది.
మరోవైపు ప్రభాస్ ఈ చిత్రంలో శ్రీరాముని పాత్రలో నటిస్తాడని.. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇదని ప్రచారమవుతోంది. అయితే ఇది పూర్తిగా రామాయణ కథ కాదు. అందులోని ఓ సోషియో ఫాంటసీ ఎలిమెంట్ ని తీసుకుని రూపొందిస్తున్నారన్న ప్రచారం వేడెక్కిస్తోంది. ప్రభాస్ శ్రీరాముడుగా సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారట.
ఇక ఈ మూవీలో చెడుపై మంచి సాధించే విజయం! అనే థీమ్ రన్ అవుతుంది. ఒక రకంగా ఇండియానా జోన్స్ తరహా కథాంశం ఇదని .. నిధి అన్వేషణ నేపథ్యాన్ని ఫిక్షనల్ గా జోడించారని కూడా చెబుతున్నారు.2021లో సెట్స్ కి వెళ్లి 2022లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.