NTR: పులితో ఎన్టీఆర్ సీన్ కు ఫిదా అయినా ఆ దర్శకుడు ఎవరో తెలుసా…!

NTR: ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ ఇండియా ఎదురుచూస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో చిత్ర బృందం జోరు పెంచింది. ఇక మార్చి 25 న విడుదలకు సిద్ధమైంది. సినిమా మీద చాలా అంచనాలు ఉండటం ఇద్దరు హీరోల అభిమానుల హడావిడి కారణంగా థియేటర్ల వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. కొంత మంది థియేటర్స్ యజమానులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు తెర ముందు మేకులను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా రోజుకో వార్త తో ఆర్ఆర్ఆర్ వార్తల్లో నిలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. ఇటీవలే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన సినిమాతో పాటు పలు విషయాలు

ఎన్టీఆర్.. పులిని చూసే సన్నివేశం తనకు బాగా అనిపించిందని సందీప్ రెడ్డి అన్నారు. పులి లేకపోయిన కూడా తారక్ ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చేశాడని అన్నారు జక్కన్న. చిత్రంలో ప్రధానమైన పాత్రలు కలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆ పాత్రల పరిచయం తరువాత ఎమోషనల్ జర్నీ మొదలు కావడానికి కూడా ఎక్కువ సమయం ఉండదు.

ఇదంతా కూడా మొదటి 20 నిమిషాల్లోనే జరిగిపోతుంది. మళ్లీ ఈ సినిమా చూడాలనే ఆలోచనతోనే థియేటర్లలో నుంచి ప్రేక్షకులు బయటికి వస్తారు” అని స్పష్టం చేశారు రాజమౌళి. కాగా ఈ మూవీలో కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటించారు. తారక్‌ సరసన ఒలీవియా మోరిస్‌, చెర్రీకి జోడిగా ఆలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.